ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌..

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వచ్చే వారం ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో కలిసి మంత్రి యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాప్‌ ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. ‘‘రాష్ట్రంలో త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తాం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు అందిస్తాం. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ పూర్తయ్యే వరకు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలి. గ్రామీణులను దృష్టిలో పెట్టుకుని యాప్‌లో తెలుగు వెర్షన్‌ ఉండేలా అధికారులు చూడాలి’’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment