●మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని అటవీ సమస్యలపై దృష్టి సారించాలని శివ్వంపేట తాజా మాజీ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ నూతన డిఎఫ్ జోజీని కోరారు. ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కొత్తపేట, నవపేట, రత్నాపూర్, తదితర గ్రామాలలో అటవీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోరినట్టు తెలిపారు.