*పేద ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ.*
*ప్రశ్న ఆయుధం, జులై 13 శేరిలింగంపల్లి,ప్రతినిధి*
మియాపూర్ ప్రగతి ఎనక్లేవ్ లో ప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోఉచిత మెగా వైద్య శిబిరం. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొవ్వ సత్యనారాయణ అన్నారు ఆదివారం నాడు మియాపూర్ డివిజన్ ప్రగతి ఎంక్లేవ్ లోని పరిధి లో ప్రగతి మండపంలో ప్రసాద్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ డి ఎస్ ఆర్ కె ప్రసాద్ , డైరెక్టర్ అండ్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ లీలా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆన్నారు. సామాజిక సేవ చేయాలనే ఆలోచనతో ప్రసాద్ ఫౌండేషన్ వారు ముందుకు వచ్చిన సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్ధారించడం అభినందనీయమన్నారు పేద ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు . ప్రసాదు ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో మేడి కోవర్ హాస్పిటల్ వారు కార్డియాక్ ఆర్థోపెటిక్ ఆంకాలజీ గైనకాలజీ, పీడియాట్రిక్ ,కంటి వైద్య పరీక్షలు ,దంత వైద్య పరీక్షల సమయంలో,ఆంకాలజీ వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మియాపూర్ ప్రముఖులు సమ్మెట ప్రసాద్, శ్రీరాం ప్రభూ బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా నాయకులు రాజమళ్ళ నాగేశ్వర గౌడ్, బిజెపి మియాపూర్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్, బీజేపీ నాయకులు పట్టాభిరామ్ హౌ ఇస్ బెడ్ దిగిన అధ్యక్షులు జితేంద్ర సీనియర్ నాయకులు శ్రీధర్ రవి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోహన్ ముదిరాజ్, మహేంద్ర ముదిరాజ్ టిడిపి నాయకులు చౌదరి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.