ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ  — డీఎస్పీ శ్రీనివాసరావు

ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ

— డీఎస్పీ శ్రీనివాసరావు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి

(ప్రశ్న ఆయుధం) జూన్ 13

IMG 20250613 WA2237

శుక్రవారం రోజున ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్, ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ S. శ్రీనివాస రావు నేతృత్వంలో ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడింది.

ఈ డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్ రోడ్ మరియు బాన్సువాడ రోడ్‌లపై ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సుమారు 200 పెండింగ్ వాహన చలాన్లు క్లియర్ చేయించబడినవిగా, రూ.1 లక్షకు పైగా జరిమానాలు వసూలు చేయడం జరిగింది.

అలాగే, వాహనాలకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేని వాటిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబడ్డాయి.

ఈ కార్యాచరణలో ఎల్లారెడ్డి సీఐ, రవీందర్ నాయక్, ఎస్సై మహేష్, ప్రొబేషనరీ ఎస్సై అరుణ్, జిల్లా స్పెషల్ పోలీస్ టీమ్ సభ్యులు, చురుకుగా పాల్గొన్నారు.

పౌరులు, రవాణా నిబంధనలు పాటించాలని, ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని, అధికారులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now