ఈసీఐఎల్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్,
మేడ్చల్ ఉప్పల్ ఫిబ్రవరి 5
ఈసీఐఎల్ చౌరస్తా నుంచి చక్రిపురం తెలంగాణ తల్లి విగ్రహం వరకు కుషాయిగూడ శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ట్రాఫిక్ విషయమై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
రోడ్డు కిరువైపులా దుకాణదారులు చిరు వ్యాపారులు రోడ్డుపై ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి సంయుక్తంగా తిరుగుతూ అవగాహన కల్పించారు.
బుధవారం నుంచి ప్రత్యేకంగా చేపట్టిన ట్రాఫిక్ అవగాహన తో రోడ్డు కిరువైపులా దుకాణదారులు చిరు వ్యాపారుల లో బాధ్యత పెరుగుతుందని ఫలితంగా ట్రాఫిక్ క్లియరెన్స్ ఏర్పడి వాహనదారులకే కాకుండా పాదచారులు ఇబ్బందులు లేకుండా గమ్యాలకు చేరుకోవడం జరుగుతుంది. చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ విజ్ఞాపన మేరకు ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన కుషాయిగూడ పోలీస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు భాస్కర్ రెడ్డి, రామ లక్ష్మణ రాజు సిబ్బందికి చర్లపల్లి కాలనీల కుటుంబాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు,