ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్..
నిజామాబాద్, జనవరి 17
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన 5 గురు వ్యక్తులకు జైలు శిక్షా మరియు 19 మందికి జరిమానా
తేదీ 17.01.2025 నాడు మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 24 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ సార్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందర హాజరుపరచగా 19 మందికి రూపాయలు జరిమా 43500 /- జరిమానా విధించి, 1. గేనే సునీల్ తండ్రి శ్రావణ్ నివాసము గాజులపేట్ అను వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష 2. కాదా సి వినోద్ తండ్రి మల్లయ్య నివాసము ఎల్లమ్మ గుట్ట 3. బి ప్రవీణ్ తండ్రి కాంతయ్య నివాసము దుబ్బ 4. రామ్ రెడ్డి తండ్రి రాజయ్య నివాసం గంగస్థాన్ 5) గోలి కార్ దినేష్ తండ్రి హరిలాల్ నివాసము నాగారం అను వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించడం అయినది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు.