మున్సిపాలిటీ పారిశుద్య కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం
జమ్మికుంట సెప్టెంబర్ 1 ప్రశ్న ఆయుధం
రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆదేశాల మేరకు సోమవారం పాత మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ చందు, మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి లు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండ, వాన, చలి అని లేకుండా నిరంతరం మున్సిపల్ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వారు పారిశుధ్య కార్మికులు అని, వారికి ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, వారి ఆరోగ్య రీత్యా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు హెచ్ఐవి, హెపటైటిస్ బి, టి బి, షుగర్ పరీక్షలు విధిగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలని,సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీపీ,షుగర్ మందులు ప్రభుత్వం అందించే మందులనే వాడాలని తద్వారా ఆర్థికంగా భారం తగ్గించుకోవచ్చు అని మలేరియా,డెంగ్యూ,చికెన్ గునియా మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి,వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత, ప్రత్యేకత గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరుణ, వైద్యులు చందన, ఫార్హనోద్దిన్ మహాముత పటేల్, సంధ్య రాణి, ఝాన్సీ, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మహేష్, సదానందం, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి పంజాల ప్రతాప్ గౌడ్, సూపర్ వైజర్లు అరుణ, సదానందం, ఆరోగ్య శాఖ సిబ్బంది రామకృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.