ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 24, (ప్రశ్న ఆయుధం):
మత్తమాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు SNSPA (Swasth Naari Sashakt Pariwar Abhiyan) ఆధ్వర్యంలో “ఆరోగ్యవంతమైన మహిళ – శక్తివంతమైన కుటుంబానికి మూలం” అనే నినాదంతో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో మహిళల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ముఖ్యంగా కంటి సంబంధిత వ్యాధుల పరీక్షలు నిర్వహించారు. మొత్తం 53 మంది మహిళలు ఈ పరీక్షల్లో పాల్గొని వైద్యుల సేవలు పొందగా, వారిలో ఐదుగురికి కంటి మోతిబిందు (Cataract) సమస్య గుర్తించబడింది. వీరిని తక్షణ చికిత్స కొరకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలమైన పునాది అన్న అవగాహనను కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని వైద్యులు తెలిపారు.
ఈ శిబిరంలో Dr. రవీందర్ (కంటి వ్యాధి నిపుణులు), Dr. శరత్‌కుమార్ (ఆరోగ్య అధికారి), జనార్దన్ రెడ్డి (హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్), సూపర్వైజర్లు, ANMs, ASHAs చురుకుగా పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు.
గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, మరిన్ని ఇలాంటి శిబిరాలు నిర్వహించాలని అభ్యర్థించారు.