నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్

*నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్*

జిల్లా న్యాయసేవాధికార సంస్థ – పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో

ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట: జిల్లా జడ్జి భారత లక్ష్మి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

నిజామాబాద్, జిల్లా ప్రతినిధి,నవంబర్ 1 (ప్రశ్న ఆయుధం)

ప్రజల విసృత ప్రయోజనాల దృష్ట్యా నవంబర్ 15న జిల్లా వ్యాప్తంగా స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి జి.వి.ఎన్. భారత లక్ష్మి తెలిపారు.

జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, IPS, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.

రాజీ పడదగిన 1,328 క్రిమినల్ కేసులను గుర్తించి, వాటి పరిష్కారార్థం లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి తెలిపారు. వివాదాలు వచ్చినప్పుడు రాజీ మార్గం ద్వారానే శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు.

ఆర్మూర్, బోధన్ కోర్టు ప్రాంగణాలతో పాటు జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో కూడా ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వివరించారు. “ప్రజలు న్యాయపరమైన వివాదాలను త్వరితగతిన రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవడానికి ఇది అత్యుత్తమ వేదిక” అని ఆమె అన్నారు.

“మనిషి సంఘజీవి. సమాజంలో అందరితో కలిసి శాంతియుతంగా జీవించాలి. సమస్యల విషవలయంలో చిక్కుకోకుండా రాజీ మార్గాన్ని ఎంచుకోవడం సమాజానికి మేలు చేస్తుంది” అని జిల్లా జడ్జి సూచించారు.

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, IPS మాట్లాడుతూ, స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీస్ శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. “చిన్న చిన్న క్రిమినల్ కేసులు, క్షణిక ఆవేశంలో జరిగిన రాజీ పడదగిన కేసులు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలి,” అని ఆయన కోరారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ మానసపుత్రికగా ఈ ‘స్పెషల్ లోక్ అదాలత్’ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. “జిల్లా జడ్జి భారత లక్ష్మి గారితో సమన్వయంతో ఈ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి ప్రత్యేక కార్యాచరణను చేపట్టాం,” అని అన్నారు.

తదుపరి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు సమన్వయంతో న్యాయార్థుల అభీష్టం మేరకు కేసులను పరిష్కరించే చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment