ప్రత్యేక లోక్ అదాలత్ నవంబర్ 15న
ప్రజల వివాదాలకు శాంతియుత పరిష్కారం
కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆహ్వానం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 1
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చి.వి.ఆర్.ఆర్. వరప్రసాద్ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి ప్రకటించిన ప్రకారం, నవంబర్ 15, 2025న కామారెడ్డి జిల్లా పరిధిలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడనుంది.
ఈ కార్యక్రమం ద్వారా చెక్కు బౌన్స్ కేసులు (N.I. Act), కుటుంబ వివాదాలు, రోడ్డు ప్రమాద పరిహార దావాలు (MACT), బ్యాంకులకు సంబంధించిన సివిల్ కేసులు, అలాగే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు వంటి వివిధ వివాదాలను పరస్పర రాజీ పద్ధతిలో పరిష్కరించే అవకాశం లభిస్తుంది.
ప్రజలు తక్కువ వ్యయంతో, వేగవంతంగా తమ కేసులను ముగించుకునే ఈ లోక్ అదాలత్ ద్వారా సఖ్యతా భావం పెంపొందించడం, న్యాయవ్యవస్థపై విశ్వాసం బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశమని కార్యదర్శి తెలిపారు.
కామారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని కోర్టు భవనాల్లో ఈ కార్యక్రమం నవంబర్ 15 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సంబంధిత పక్షాలు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గుర్తుంచుకోండి – “రాజీ మార్గమే రాజమార్గము.”