బాసర వార్త:-
బాసరలో రైతు నేస్తం కార్యక్రమం..
నిర్మల్ జిల్లా:-బాసర మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఉదయం 10 గంటలకు రైతు నేస్తం(వీడియో కాన్ఫరెన్స్)ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు వివిధ రకాల సాగు పంటలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుకు 500 రూపాయల బోనస్ పై అవగాహన కల్పించారు. ఇప్పటికే మహబూబ్ నగర్,కామారెడ్డి జిల్లాలో రైతులకు బోనస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి.శ్రీకర్. ఏఈఓ.అజయ్ కుమార్ రైతుల సౌకర్యార్థం రైతు వేదికలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.రైతులు తమ పండించిన వరి కొయ్యలు కాల్చడం-నష్టాలు వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించడం జరుగుతుందన్నారు. సారవంతమైన భూమి దెబ్బతింటున్నదని పేర్కొన్నారు.రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశేషాలతో సిరులు సంపాదించవచ్చని వరి కోత అనంతరం ఉండే గడ్డిని పశువులకు వాడడం లేదా కంపోస్టుగా మార్చుకునేందుకు రైతు నేస్తం ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.