Site icon PRASHNA AYUDHAM

ప్రత్యేక అధికారులు ప్రతివారం వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు తనిఖీలు చేయాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలాలు, మాడల్ పాఠశాలలలో మండల ప్రత్యేక అధికారులు, ఆయా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, ఆర్ సీఓలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులు, గురుకులాల, కేజీబీబీల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల పరిధి సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలను కేజీబీవీపీలను మోడల్ పాఠశాలలను ప్రతి వారం తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో, కళాశాలలో, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలల ఆవరణలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు తనిఖీ సమయంలో ఆయా సంస్థల్లోని వంట గదులు, స్టోర్ రూమ్లను డైనింగ్ హాల్ లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తరగతి గదులు విద్యార్థుల గదులను కిటికీలు డోర్లు అవసరమైన మరమ్మతులకు ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు. అవసరమైన అద్దె భవనం యజమానులతో మాట్లాడి వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వసతి గృహాలకు అవసరమైన కాంపౌండ్ వాల్, సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కు సంబంధించిన నివేదికలు అందించాలన్నారు. వసతి గృహాలకు విద్యార్థులకు సరిపడా మంచినీటి కనెక్షన్లు ఇప్పించాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు అందించే విషయంలో అలసత్వం వహించద్దు అన్నారు. మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలో కస్తూర్బా పాఠశాలల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా.. లేదా తెలుసుకోవాలన్నారు. వసతి గృహాల సందర్శన సమయంలో స్టోర్ రూమ్లను పరిశీలించి నాసిరకం వస్తువులను వెంటనే వెనక్కి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యంలో తెల్ల పురుగులు లాంటివి వస్తే వెంటనే స్టాకు వెనక్కు పంపాలన్నారు. ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులను వెంటనే స్టాక్ నుండి తీసివేయించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం తయారు చేసేలా వంట ఏజెన్సీ సిబ్బంది, విద్యార్థుల సంఖ్యకు సరిపడా నియమించుకోవాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులు ఆదేశించారు. వసతి గృహంలో ఉన్న ప్రతి చిన్న సమస్యలు సైతం గుర్తించి వాటి మరమ్మత్తులకు పూర్తిస్థాయి నివేదికను అందజేయాలన్నారు. ప్రైవేటు అద్దె భవనాల్లో ఉన్న సంస్థల లో అవసరమైన మరమ్మత్తులను ఆయా భవనాల యజమానులతో మాట్లాడి వెంటనే మరమ్మత్తులు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ఎక్కడైనా అధికారులు తమ విధులు పట్ల నిర్లక్ష్యంగా వహించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జడ్పీసీఈఓ జానకి రెడ్డి, జిల్లాలోని వివిధ మండలాల ప్రత్యేక అధికారులు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల, గురుకుల పాఠశాలల ప్రత్యేక అధికారులు, ఆర్సిఓలు పాల్గొన్నారు.

Exit mobile version