లింగాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు

లింగాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కామారెడ్డి పట్టణం లింగాపూర్ లోని శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కల్కి నగర్ వాస్తవ్యులు కొడిప్యాక సాయిరాం కాశీ నుండి 1100 రుద్రాక్షలు తీసుకువచ్చి భక్తులకు కాశీ రుద్రాక్ష మాల రుద్రలను ఉచితంగా అందజేసి పట్టణ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొమిరెడ్డి పెద్ద నారాయణ, మాజీ ఎంపిపి ఉరుదొండ నరేష్, ప్రవీణ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment