- శ్రీ వైద్యనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొనడం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధ అక్టోబర్ 21
పట్టణంలోని శ్రీ వైద్యనాథ్ ఆలయంలో నేడు అమావాస్య, కార్తీక పౌర్ణమి ప్రారంభం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకున్నారు. భక్తులతో కలిసి హారతులు సమర్పించి, జిల్లా ప్రజలకు శాంతి, సమృద్ధి కలగాలని ప్రార్థించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.