Site icon PRASHNA AYUDHAM

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రత్యేక పూజలు

 

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 20 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండలంలోని సికింద్లాపూర్ గ్రామ శివారులో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మెదక్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకొని లక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై ఉన్న దేవా లయానికి భక్తులు కాళినడకన చేరుకొని స్వామివారిని ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు, తలనీలాలు సమర్పించారు. కింద దేవాలయంలో స్వామివారిని అభిషేకం, అర్చనలతో పాటు లక్ష్మీనరసింహ్మస్వామి వారి కల్యాణం, వ్రత మండపంలో సమూహిక సత్యనారాయణస్వామి పత్రాలు నిర్వహించి,
ఆలయం పక్కన ఉన్న గుండంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.
క్యూలైన్ల వద్ద భక్తులను ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తునం అని ఆలయాల ప్రధాన అర్చకుడు.
దనుంజయ శర్మ ఈవో శశిధర్ తెలిపారు

Exit mobile version