ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 10 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తజన సందడి నెలకొంది ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ఛైర్మన్ ఆంజనేయ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రుల దేవదత్త శర్మఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రత్యేక హారతి నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసామని ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ప్రధాన అర్చకులు దేవదత్త శర్మ దేవిశ్రీ ప్రభు శర్మ శ్రీ హర్ష శ్రీ చరణ్ శ్రీవత్సవ శర్మ ఆలయ సిబ్బంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు