ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 27 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట మండల కేంద్రంలోని సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకొని సంతోషిమాత అమ్మవారి కి పంచామృతాలు, పవిత్ర జలాలతో ప్రత్యేక అభిషేకం పూజలు చేశామని పూజారి శాస్త్రుల శ్రీ హర్ష తెలిపారు భక్తులు పలు విధ ద్రవ్యాలు, గాజులు, పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి, రకరకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ధూప, దీపం, పండ్లు, ఫలాలు నైవేద్యం సమర్పించి మంగళహారతి చేశారు.సంతోషి మత రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు