వర్షాలు పడి పంటలు పండాలని దేవతలకు ప్రత్యేక పూజలు

*గ్రామ దేవతలకు జలాభిషేకం*

*వర్షాలు పడి పంటలు పండాలని దేవతలకు ప్రత్యేక పూజలు*

*హుజురాబాద్ జులై 21 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రంగనాయకుల గుట్ట వద్ద దేవతలకు ఎల్లమ్మ గుడి, అలాగే సమ్మక సారక్క వన దేవతల వద్ద వర్షాలు పడాలని, వానదేవుడు కరుణించాలని డప్పు చప్పుల, డీజే సాంగ్స్ తో పట్టణంలోని దేవాలయాల వద్దకు వెళ్లి గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ దేవతలకు సకాలంలో వర్షాలు కురువాలని జలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నలబాలు వేణు మాట్లాడుతూ వర్షాలు పడితేనే ప్రతి ఒక జీవరాశితో పాటు, రైతులకుపాడిపంటలు, ప్రతి ఒక్కరికి ప్రత్యామ్న్యాయ మని, సమస్త జీవకోటి జీవించాలన్న, జీవనోపాధి ఉండాలంటే వర్షాల వల్లనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని 21 అవార్డుకు సంబంధించిన ప్రజలు పంజాల కళాధర్, కట్కూరి జనార్దన్ రెడ్డి, గుర్రం హరి, గుర్రం నవీన్, శ్రీనివాస్, రాజు, రామ్ రెడ్డి, లింగమూర్తి, కిరణ్, బంటి, ఇప్పకాయల సాగర్, తోట సాంబయ్య, ఆలేటి సుశీల, రజిత, లత, ఈశ్వరమ్మ, ఇప్పకాయల రాణి, సింధు, భవ్యశ్రీ, శారద, సంధ్య, టీనా, నాగలక్ష్మి, జ్యోతి, సరోజన, చిక్కి, లత, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment