Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డిలో రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక బృందం

IMG 20250922 WA0018

కామారెడ్డిలో రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక బృందం

— 60 రోజుల పాటు ప్రతిరోజూ గుంతల పూడ్చివేత

 — కలెక్టర్ ప్రారంభం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 22

 

అధిక వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణంలో దెబ్బతిన్న రహదారుల తక్షణ మరమ్మత్తు కోసం ప్రత్యేక బృందం (Instant Repairs Team) ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్‌లో తక్షణ మరమ్మత్తుల వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణంలో రోడ్లపై ఏర్పడిన గుంతలను సిమెంట్ కాంక్రీట్‌తో పూడ్చేందుకు ప్రత్యేక బృందాలు 60 రోజులపాటు ప్రతిరోజూ అన్ని వార్డులను పరిశీలిస్తాయని తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చందర్ నాయక్, మున్సిపల్ డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version