సంగారెడ్డి, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ పురస్కరించుకొని బైక్ ర్యాలీ నిర్వహించిన గౌడ యువ నాయకులందరికీ యువజన విభాగం నాయకుడు నక్క సంకీర్త్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నక్క సంకీర్త్ గౌడ్ మాట్లాడుతూ.. బైక్ ర్యాలీ ద్వారా పట్టణమంతా మార్మోగి, పాపన్న గౌడ్ వీరోచిత గాథను ప్రజలకు గుర్తు చేశారని అన్నారు. ఈ ర్యాలీని సమన్వయంతో, ఐక్యతతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సమాజానికి, తెలంగాణ చరిత్రకు చిరస్మరణీయులు అని, మానవతా విలువల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడారని, ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలు మనకు స్ఫూర్తిదాయకం అని తెలిపారు. అందరూ పాపన్న గౌడ్ ఆలోచనలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ సమాజ సేవలో, ప్రజా సేవలో ముందుండాలని కోరుకుంటున్నానని నక్క సంకీర్త్ గౌడ్ అన్నారు.
బైక్ ర్యాలీ నిర్వహించిన గౌడ యువ నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు: యువజన విభాగం నాయకుడు నక్క సంకీర్త్ గౌడ్
Oplus_131072