వర్షాలు కురవాలని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

వర్షాలు కురవాలని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

 

కామారెడ్డి జిల్లా గాంధారి

(ప్రశ్న ఆయుధం) జులై 19

 

గాంధారి మండలం ముదెల్లి

ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు తొలగించి గ్రామానికి మెరుగైన వర్షాలు కురవాలని ముదెల్లి గ్రామంలో హనుమాన్ కమిటీ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ హనుమాన్ ఆలయంలో కప్పని ఊరేగింపు ఘనంగా నిర్వహించగా, అనంతరం జలాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హనుమాన్ కమిటీ సభ్యులు రామచంద్రరావు బంజ, కాశీనాథ్ , మంగమ్మగారి రవీందర్రావు పాల్తి భాస్కరరావు సాయిగౌడ్, బల్గూరి సురేందర్, వడ్నాల లక్ష్మయ్య, కిరణ్ గౌడ్, చాకలి రాజు, గొల్ల సాయిలు, మంగలి సురేష్, కుమ్మరి అంజయ్యలు పాల్గొన్నారు. గ్రామస్తులు, యువకులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలకు సహకరించారు. గ్రామానికి మంచి వర్షాలు కురిసి సాగు పనులు సజావుగా సాగాలని భగవంతుడిని ప్రార్థించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment