కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
భక్తిశ్రద్ధలతో వాసవి మాతకు అభిషేకం
గజ్వేల్, 31 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యపుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ వాసవి మహిళా క్లబ్ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు. మహిళలు ఏకరూప వస్త్రధారణతో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించారు వాసవి మాత కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని ఆర్యవైశ్య నాయకులు అమ్మవారిని వేడుకున్నామని అన్నారు. అనంతరం పురోహితులు శంకర్ పంతులు ఇటీవల గజ్వేల్ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి శంకర్ పంతులకు అభినందనలు తెలిపారు ప్రతినిత్యం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహిస్తు అందరి ప్రేమ అభిమానాలను పొందారని అన్నారు, వారికి వారి కుటుంబానికి ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, యువకులు, మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.