అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

*అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు*

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి టౌన్ :

కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో రథసప్తమి సందర్భంగా, గుడి ప్రతిష్ట రోజున వైభవంగా గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి పడిపూజ వరకు ఆలయంలో వివిధ రకాల పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రతిష్ట రోజు రథసప్తమిని పురస్కరించుకొని వైభవంగా స్వామివారి పూజలు కనుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 1200 మంది స్వాములు భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి గోనే శ్రీనివాస్, కోశాధికారి నారాయణ, ఉపాధ్యక్షులు, కార్యదర్శిలు, రాజేందర్, రఘు కుమార్, శ్రీనివాస్, కోశాధికారి మోట్కూరు శ్రీనివాస్, నీల రాజు, చిత్ర ఓంకారం లక్ష్మీకాంతం స్వామి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment