వరి కొనుగోలు వేగవంతం చేయండి
_జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా, నవంబర్ 29:
కామారెడ్డి జిల్లా పరిధిలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సందర్శించారు. వరి కొనుగోలు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, అక్కడి అధికారులతో కొనుగోలు స్థితిగతులపై సమగ్ర సమాచారం తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైన టార్ఫాలిన్ షీట్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, రోజూ ఎన్ని క్వింటాళ్ల వరి లోడింగ్ జరుగుతుందో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఐకెపి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా సంబంధిత విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, DM శ్రీకాంత్, APM మెప్మా శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.