Site icon PRASHNA AYUDHAM

ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయండి

*ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయండి*

*మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్*

*జమ్మికుంట డిసెంబర్ 11 ప్రశ్న ఆయుధం::-*

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని12, 23, 24, 25,26, 27 వార్డులలో స్వయంగా కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్ పర్యటించారు. సర్వే చేస్తున్న తీరును ఆయన పరిశీలించారు. వార్డు ఆఫీసర్లు విధిగా ప్రతి దరఖాస్తు దారుని ఇంటికి వెళ్లి సర్వే పనులు అన్ లైన్ లో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, మహేష్ తో పాటు పలువురు వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version