ప్రజాక్షేత్రంలో గడపాలి…

సహాయక చర్యల్లో పార్టీ శ్రేణులు, రెడ్ షర్ట్ వాలింటేర్లు భాగస్వామ్యం కావాలి
వరదలు తగ్గుముఖం పెట్టేవరకు నాయకులు కార్యకర్తలు ప్రజాక్షేమాత్రంలోనే గడపాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాష
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి 23
ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేయండి పార్టీ కార్యకర్తలు రెడ్ షర్ట్ తో సహాయ చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చార.
కొత్తగూడెం శేషగిరి భవన్ నుండి మంగళవారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాష మీడియాకు వెల్లడించారు.
పారిశుద్ధ్య సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలి.పునరావాస కేంద్రాలుగా పార్టీ కార్యాలయాలను సిద్ధం చేయాలి.బస, బోజనవసతికి కావాల్సిన వనరులు పార్టీ ఆధ్వర్యంలో సమకూర్చుకోవాలి.
ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో అధికారులు సకల సౌకర్యాలు కల్పించాలి.
గ్రామాల్లో ముమ్మరంగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి. వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలి.
పాతకొత్తగూడెం పునరావాస కేంద్రాన్ని బాధితులు సద్వినియోగ చేసుకోవాలి.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పాతకొత్తగూడెం ఎస్సి కాలనీ లబ్దిదారులకు తొలిప్రాధాన్యత ఇచ్చేందుకు ఎమ్మెల్యే కూనంనేని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Join WhatsApp

Join Now