మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం నేడు
హైదరాబాద్ మూసాపేటలో జరుగనున్న మహా సభకు మున్నూరు కాపులందరూ హాజరుకావాలని పిలుపు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) నవంబర్ 1
తెలంగాణ నలుమూలల నుంచి మున్నూరు కాపు సమాజానికి చెందిన ముద్దుబిడ్డలు ఈరోజు (ఆదివారం) హైదరాబాద్ మూసాపేటలోని మెజెస్టిక్ గార్డెన్స్ వద్ద నిర్వహించనున్న మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని మున్నూరు కాపులు అందరూ ఈ మహాసభకు హాజరై సమాజ ఐక్యతకు తోడ్పడాలని, బీసీల ఐక్యతలో మున్నూరు కాపులు మూలమణిగా నిలవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్ సాధనలో భాగస్వాములమవ్వాలని, భారీ సంఖ్యలో హాజరై సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆకుల శ్రీనివాస్ పటేల్ పిలుపునిచ్చారు.