మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో క్రీడా సంబురాలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో క్రీడా సంబురాలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 28

జాతీయ క్రీడా దినోత్సవం-2025 సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఉద్యోగుల కోసం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

మేడ్చల్: జాతీయ క్రీడా దినోత్సవం-2025ను పురస్కరించుకుని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ఐఏఎస్ ఆధ్వర్యంలో, జిల్లా యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఈ పోటీలను నిర్వహించింది. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జరిగిన ఈ వేడుకల్లో కలెక్టరేట్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వాలీబాల్, రన్నింగ్, చెస్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, మ్యూజికల్ చైర్, క్యారమ్స్ వంటి క్రీడాంశాలలో ఉద్యోగులు తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ, “క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి. క్రీడాస్ఫూర్తిని ఉద్యోగ జీవితంలో పాటిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలం” అని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని ఆమె సూచించారు.

పోటీల అనంతరం విజేతలకు అదనపు కలెక్టర్ రాధికా గుప్తా చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లా ఆఫీసర్ చంద్రావతి, స్పోర్ట్స్ అధికారి జి.వి. గోపాల్ రావు, ఏవో ఎల్. రామ్మోహన్ రావుతో పాటు కలెక్టరేట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment