క్రీడలు క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేది క్రీడలేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని భానూరులో ఆర్.కె క్లబ్ వారు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ అండర్ 14 బాలికల క్రీడా విభాగంలో గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన స్పార్టెన్స్ టీమ్ మొదటి బహుమతి గెలుచుకుంది. మొదటి బహుమతి సాధించిన విద్యార్థులు, కోచ్‌లు సంపత్, మల్లేష్‌లతో కలిసి గుమ్మడిదలలోని సిజిఆర్ ట్రస్ట్ కార్యాలయంలో గోవర్ధన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణను, శారీరక దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇలాంటి ప్రతిభ వెలుగులోకి రావడం ఎంతో ఆనందదాయకం అని తెలిపారు. యువత క్రీడలు, చదువుల్లో రాణించేందుకు సిజిఆర్ ట్రస్ట్ తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment