జిల్లా విద్యాధికారి శ్రీ రాధా కిషన్ ఆదేశాల మేరకు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రమేష్ గంగాల సూచనలతో శివ్వంపేట మండల స్థాయి క్రీడోత్సవాలను ఈనెల 12 మరియు 13 తేదీలలో మండల పరిధిలోని గోమారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి కే.బుచ్చా నాయక్ తెలిపారు, బుధవారం విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మొదటిరోజు బాలుర విభాగం, రెండవ రోజు బాలికల విభాగంలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 12న బాలురకు అండర్ 14 మరియు అండర్ 17 విభాగంలో వాలీబాల్,కబడ్డీ, ఖో ఖో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రెండవ రోజు 13వ తేదీన బాలికలకు అండర్ 14 మరియు అండర్ 17 విభాగంలో వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని అన్ని పాఠశాలల నుండి విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి నర్సాపూర్ నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి సునితాలక్ష్మారెడ్డి గారు, జిల్లా విద్యాధికారి శ్రీ రాధా కిషన్ గారు, పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్ గంగాల గారు హాజరవుతారని బుచ్యా నాయక్ తెలిపారు. సమావేశంలో గొమారం, శివ్వంపేట ఫిజికల్ డైరెక్టర్లు కిషోర్,చంద్రమోహన్ పాల్గొన్నారు.
ఈనెల 12 13 తేదీలలో క్రీడోత్సవాలు
Published On: September 11, 2024 8:16 pm