క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం
నల్లవెల్లి కరుణాకర్ రెడ్డిసెపక్ తక్రా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
ప్రశ్న ఆయుధం 28జులై హైదరాబాద్ :
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వటానికి ముందుకు వచ్చి రాష్ట్ర బడ్జెట్లో 325 కోట్లు నిధులు కేటాయించడం హర్షణీయమని తెలంగాణ సేపక్ తక్రా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు.
బడ్జెట్లో నిధులు
కేటాయించినందుకుగాను రాష్ట్ర క్రీడాకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రలోని అన్నిరకాల క్రీడాలకు క్రీడాకారులకు విద్య ఉద్యోగాల్లో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
అలాగే కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న ఇందిరాగాంధీ క్రీడ మైదానానికి మౌలిక వసతులు కల్పించాలని మరియు ఈ మైదానంలో ఇండోర్ కబడ్డీ ఇండోర్ షటిల్ బ్యాట్మెంటన్ కోర్ట్లు ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుచేసి స్టేడియం చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, స్టేడియం లోపల గ్రీనరీ తో పాటు ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయాలని,
ఇందిరాగాంధీ క్రీడా మైదాననికి వివిధ రకాల క్రీడలకు కోచ్ నియమించాలని ఈ సందర్భంగా
కామారెడ్డి జిల్లా లో ఉన్న జాతీయ స్థాయి క్రీడాకారులందరికీ అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగడానికి దోహదపడుతుందని,మరియు జిల్లాలో క్రీడాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్బంగా వారు ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు .