తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ – 2025-26 పోటీలకు సంబంధించి కామారెడ్డి జిల్లా స్థాయి ఎంపికలు ఇందిరా గాంధీ స్టేడియంలో అథ్లెటిక్స్ మరియు రెజ్లింగ్ విభాగాలలో ప్రారంభమయ్యాయి.
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల కార్యక్రమానికి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్, యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలువురు అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ ఎంపికల ప్రక్రియలో SGF సెక్రెటరీ హీరోలాల్, PETA TS ప్రధాన కార్యదర్శి నోముల మధుసూదన్ రెడ్డి, TGPETA సెక్రెటరీ అశోక్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి డా. కె.పి. అనిల్ కుమార్, ట్రెజరర్ నరేష్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వినోద్, ప్రధాన కార్యదర్శి పవన్, X SGF సెక్రెటరీ వెంకట్, ఖో ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అతికుల్లా వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
వ్యాయామ ఉపాధ్యాయులు విజయలక్ష్మి, రేణుక, అరుణ, శ్రీవాణి, స్వప్న, సంధ్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపికైన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా యువ క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో రాణించే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు.


