తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థినులు, సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభను కనబరిచారు.
ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థినులు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రెజ్లింగ్ విభాగంలో సోనియా స్వర్ణ పతకం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
అట్యా-పట్యా విభాగంలో బ్యూలా రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. హ్యాండ్బాల్ విభాగంలో పాల్గొన్న జట్టు ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకం గెలుచుకుంది.
ఈ జట్టులో సోనియా, అఖిల, సాగరిక, సంధ్య, హుమేరా, ప్రియాంక, భాగ్యలక్ష్మి, ఆయేషా జువేరియా ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.
ఫుట్బాల్ విభాగంలో షాహిస్తా, తేజస్విని, షమీమ్, మాహీన్, ఆయేషా జువేరియా, ఆయేషా ఫర్హీన్, సబియా, సంధ్య, ముస్కాన్ ఫాతిమా, ఖురత్ ఉల్ ఐన్, నిఖత్, లవ్లీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.


