ఎస్ పి ఆర్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

ఎస్ పి ఆర్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామ శివారులోని ఎస్పీఆర్ స్కూల్ అఫ్ ఎక్స్లెన్స్ లో పదవ తరగతి పరీక్షల్లో భాగంగా 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమ ర్యాంకును సాధించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ కరస్పాండెంట్ మారుతి తెలిపారు. తమ పాఠశాలలో చదివిన మరో ఇద్దరు కొండ గాయత్రి, తొడుపునూరు శ్రీనీత లు 590 మార్కులు సాధించి ఉత్తమ ఎస్పిఆర్ పాఠశాలను రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చినందుకు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన నిమ్మ హర్షిత తండ్రి శశి కుమార్ తమ కూతురు రాష్ట్రర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని కృషి చేసిన ఎస్పిఆర్ స్కూల్ పాఠశాల మేనేజ్మెంట్ తో పాటు ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,ఆనందం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now