Site icon PRASHNA AYUDHAM

జాతీయ సబ్ జూనియర్ హాకీ పోటీలకు ఎంపికైన శ్రావ్య

హాకీ

జాతీయ సబ్ జూనియర్ హాకీ పోటీలకు ఎంపికైన శ్రావ్య

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 02, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్ రెడ్డి కూతురు శ్రావ్య ఆర్ఆర్సి గ్రౌండ్ లో నిర్వహించే నేషనల్ టోర్నమెంట్ కు తెలంగాణ టీంలో ఎంపికైన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమెను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ మాట్లాడుతూ భవిష్యత్ లో ఇలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ తల్లిదండ్రులకు, గురువులకు, కామారెడ్డి జిల్లాకి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్, బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి సూర్య మల్లేష్ , బీసీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోడూరి ఆంజనేయులు, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేందర్, రాజంపేట మండల అధ్యక్షుడు మురళి, పాల్వంచ మండల ఇన్చార్జి బాలకృష్ణ, పాల్వంచ అధ్యక్షుడు అంజయ్య, కామారెడ్డి టౌన్ నాయకులు రాజయ్య, పెంటయ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version