Site icon PRASHNA AYUDHAM

కౌకూర్ కాలాడి మఠంలో వైభవంగా శ్రీ ఆది శంకర చార్య మహా సంసార్ధన పూజలు

IMG 20250502 WA2602

*కౌకూర్ కాలాడి మఠంలో వైభవంగా శ్రీ ఆది శంకర చార్య మహా సంసార్ధన పూజలు*

మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 2

కౌకూర్ కొలువైన శ్రీ ఆది శంకర మఠంలో శ్రీ శ్రీ జగదుర్గు ఆది శంకర చార్య మహా సంసార్ధన సందర్భంగా ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు.

నాగారం పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ పూజలో భాగస్వాములయ్యారు. మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి మరియు జయ కుమార్ తదితరులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

చంద్రారెడ్డి మరియు ఇతర నాయకులు ఆది శంకరాచార్యుల వారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మఠం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆది శంకరుల బోధనలను కొనియాడారు. వారి ఉపదేశాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మఠం ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. భక్తులు ఆది శంకరాచార్యుల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మఠం కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Exit mobile version