ముత్యపు వీరేశలింగం గుప్తాకు శ్రీ భగళాముఖి పీఠ సేవా సార్వభౌమ బిరుదు ప్రధానం

ముత్యపు వీరేశలింగం గుప్తాకు శ్రీ భగళాముఖి పీఠ సేవా సార్వభౌమ బిరుదు ప్రధానం

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 12, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మిక ధార్మిక సేవలో ముందుండి సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ తన వంతు సహాయం చేసే మంచి మనస్తత్వం కలిగిన, ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం గల వీటన్నిటికీ మించి భగలాముఖి పీఠానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ పీఠం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నటువంటి ముత్యపు వీరేశలింగం గుప్తాకు శ్రీ భగలాముఖి పీఠం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సగర్వంగా మంగళవారం శ్రీ బగలాముఖి పీఠ సేవా సార్వభౌమ అనే బిరుదును ప్రధానం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ప్రముఖ వ్యాపారవేత్త భఘలాముఖి పీఠానికి వెన్నుముక, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ గుప్తా ఆధ్వర్యంలో భగలాముఖి పీఠం యొక్క భక్తులందరి సమక్షంలో ఎల్లారెడ్డి పట్టణ వైశ్యుల సమక్షంలో జరుగును. కావున పీఠం సభ్యులు, మిత్రులు, అభిమానులు తప్పకుండా హాజరుకాగలరని భగలాముఖి పీఠం తరపున తెలిపారు.

Join WhatsApp

Join Now