మియాపూర్‌లో శ్రీ గంగాస్ కన్సల్టెన్సీ ఘనంగా ప్రారంభం
శేరిలింగంపల్లి ప్రశ్న ఆయుధం.ఆగస్టు 10
శేరిలింగంపల్లి నియోజకవర్గం,
మియాపూర్ గ్రామంలో శ్రీ గంగాస్ కన్సల్టెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఎన్ నగర్‌కు చెందిన శ్రీ గంగాధర్ సోంటెన ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో మియాపూర్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.
కొత్త వ్యాపార ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ పెద్దలు రాచమల్ల కృష్ణపటేల్, అకుల లక్ష్మణ్, అశోక్,వినోద్ చౌదరి, వంశి, ప్రవీణ్, తులసి, తదితరులు పాల్గొని కార్యక్రమానికి విశిష్టతను చేకూర్చారు.