మెదక్/నర్సాపూర్, జనవరి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం శ్రీ కేతకి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గంగ జ్యోతి వెలిగించడానికి ఒగ్గు కళాకారులతో కలిసి ఆలయ నిర్మాణదాత వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, వాల్దాస్ అర్వింద్ గౌడ్ తదితరులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ముకుందం రెడ్డి, కోళ్ల శీను, శ్రీనివాస్ గౌడ్, ఒగ్గు భాషయ్య, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
గొల్లపల్లిలో శ్రీ కేతకి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Published On: January 11, 2025 9:51 pm