ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 13 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
సహపంక్తి భోజనాలు
ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తొలగించిన ఏరియా జిఎం దుర్గం రామచందర్, ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా కొండాపురం సిఎస్ పి ఆవరణలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ ఓంకారేశ్వరి దేవి ఆలయంలో సింగరేణి మరియు ఉద్యోగుల, కార్మికుల సంరక్షణ, లోక కళ్యాణం లక్ష్యంగా లక్ష్మీ నారాయణ స్వామి వృక్ష కళ్యాణ మహోత్సవం (రావి చెట్టు నారాయణస్వామి, వేప చెట్టు లక్ష్మీదేవి)గురువారం నాడు కన్నుల పండువగా జరిగింది, కుల మతాలకతీతంగా సింగరేణి పర్మినెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కలిసి సోదర భావంతో ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వృక్ష కళ్యాణం మహోత్సవం జరుపుకున్నారు. నారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతుల విగ్రహాలను సైట్ ఆఫీసు నుండి ఆలయం వరకు మేళ తాళాలతో అధికారులు కార్మికులు ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఎప్పుడు యంత్రాల ధ్వనులతో ప్రతిధ్వనించే సి ఎస్ పి ఆవరణలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏరియా జిఎం దుర్గం రామచందర్ ముఖ్యఅతిథిగా , ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్ విశిష్ట అతిథిగా పాల్గొని స్వామివారి వృక్ష కల్యాణ మహోత్సవాన్ని ఎంతో ఆధ్యాత్మిక చింతనతో ఉద్యోగులతో కలిసి ఆసక్తిగా తిలకించారు. అధికారులు, ఇంజనీర్లు, సూపర్వైజర్లు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. అనంతరం సహపంక్తి భోజనాలలో కూడా సమిష్టిగా అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కే సి ఎస్ పి డి జి ఎం, ఆలయ ధర్మకర్త
వడిత్యా మదన్ నాయక్, ఇంజనీర్లు ఆర్ఎస్ గౌడ సందీప్, రామకృష్ణ ,మల్లయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సూపర్వైజర్లు అజిత్, కృష్ణమూర్తి ,బి వెంకటేశ్వర్లు, కార్మిక సంఘాల నాయకులు ఆవుల నాగరాజు ,శ్రీనివాస్ (ఏఐటీయూసీ) వత్సవాయి కృష్ణంరాజు, శ్యాం వర్మ (ఐ ఎన్ టి యు సి) మరియు నాగెల్లి వెంకట్ (టీబీజీకేఎస్) శ్రీకాంత్ (సిఐటియు), ఎస్ డి నా సర్ పాషా (ఐ ఎఫ్ టి యు), హెచ్ఎంఎస్ బిఎంఎస్ మరియు ఇతర కార్మిక సంఘాల నాయకులు వి ప్రభాకర్ రావు, రామారావు, ముత్యం, శ్రీనివాస్, బాలాజీ, తదితరు పాల్గొనగా స్వామివారి వృక్ష కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా ఆలయ కమిటీ సభ్యులు శివ, నరసింహారావు,చలపతి ల ఆధ్వర్యంలో కార్మికుల సహకారంతో విస్తృత ఏర్పాటు చేశారు.
కొండాపురం సి ఎస్ పి లో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వృక్ష కల్యాణ మహోత్సవం
by Naddi Sai
Published On: February 13, 2025 7:19 pm
