*నాగారం శిల్పా నగర్‌లో శ్రీ మరకత చంద్రమౌళిశ్వర స్వామి వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహణ**
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 15
ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు వారిని ఘనంగా సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.ఈ వేడుకల్లో రాష్ట్ర, జిల్లా, మున్సిపల్ స్థాయి బీజేపీ నాయకులు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శ్రద్ధాభక్తులతో వేడుకల్లో పాల్గొన్నారు.వార్షికోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మికతతో నింపాయి.