శ్రీ పరశురామేశ్వర ఆలయం : గుడిమల్లం.
తన ఒడికి చేర్చుకునే గుడిమల్లం దేవుడు శివుడు
గుడి ఏనాటిదో ఖచ్చితంగా చెప్పటానికి తగిన శాసనాలేవీ లభించలేదు . కానీ పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ఇది క్రీ.పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది .అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు , ఎప్పుడు ప్రతిష్టించారో మాత్రం తెలియటం లేదు .ఆలయంలోని శివ లింగం ఆకారం మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది . దానిమీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటాడు .శివుడి కుడిచేతిలో జింక , ఎడమ చేతిలో భిక్షపాత్ర , ముంజేతికి కడియం , చెవులకి కుండలాలు , భుజం మీద గండ్ర గొడ్డలి , తలకు తాటికాయలు కిరీటం , మొలకు ధోవతి స్పష్టంగా కనిపిస్తాయి .చళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు . వాళ్ళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని ” తిరువిప్పురమ్ బేడు ” అని పిలిచినట్టు తెలుస్తోంది . అంటే తెలుగులో ‘ శ్రీ విప్రపీఠం ‘ అంటారు . పల్లపుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడిపల్లంగా మారిపోయింది . కాలక్రమంలో అదే గుడిమల్లంగా మారిపోయింది.ఈక్షేత్రంలోఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అనునది సుస్ఫష్టం.శివలింగములన్నీ ఆద్యంతములులేని స్తంభమువలె లింగరూపంలో దర్శనమిస్తాయి.ఆలయమందు శివుడు పరశురామేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన శివస్వరూపం జ్యోతిర్లింగ ఆలయాలు మరియు ఇతర శివాలయాల మాదిరిగా లింగ రూపంలో కాక పురుషాంగాన్ని పోలి ఐదుఅడుగుల పొడవు ఒక అడుగు వెడల్పుతో ముదురు కాఫీరంగు రాతితో చేయబడి వేటగానితూపంలో శివుడు యక్షుని భుజాలపై నిలబడి రుద్రుని భంగిమలో దర్శనమిస్తాడు.రెండు చేతులందు తలక్రిందులుగా గొర్రెపోతు కాళ్ళు కుడిచేతితో, చేతిలో చిన్నపాత్ర పట్టుకొని తలకట్టుతో, చెవులకు రింగులు మరియు ఆభరణాలు ధరించి నడుమునుండి మోకాళ్ళ వరకూ వస్త్రముధరించి యజ్ఞోపవీతం లేని వేటగానివలె కనపడతాడు. ఎడమభుజం ఆనుకొని గొడ్డలిఉంది. పలుచని వస్త్రమునుండి స్వామివారి శరీరభాగములు స్పష్టంగా కనపడతాయి. తలపాగా, దోవతిధరించిన రుద్రుని వస్త్రధారణ రుగ్వేదకాలం నాటిదని తెలుస్తూంది.