శ్రావణ మాస పుణ్యోత్సవం తారానగర్ లింగంపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ దర్శనములు..

శ్రావణ మాస పుణ్యోత్సవం తారానగర్ లింగంపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ దర్శనములు..

ప్రశ్న ఆయుధం,ఆగస్టు,5, శేరిలింగంపల్లి,ప్రతినిధి

శ్రావణ మాస పుణ్యోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్, లింగంపల్లి ప్రాంతంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు ఉత్సవంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ , బి ఆర్ ఎస్ పార్టీనాయకులు, స్థానిక సోదర సోదరీమణులతో కలిసి దేవి దర్శనాలు చేసుకున్నారు. రవియాదవ్ మాట్లాడుతూ..శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశీర్వాదాలు మన తారానగర్ ప్రజలందరికీ సమృద్ధిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను, ఈ పుణ్యోత్సవం ద్వారా మన సామాజిక ఐక్యత మరింత బలపడుతుంది అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కే. ఎన్. రాములు,రవి కుమార్, గడ్డం శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, సాయి నందన్ ముదిరాజ్, స్వామి ముదిరాజ్, శంకర్, సురేష్, వడ్డే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment