శ్రీ రుద్రసహిత శతచణ్డీ పురశ్చరణ మహా యాగ సమాహ్యనము

*శ్రీ రుద్రసహిత శతచణ్డీ పురశ్చరణ మహా యాగ సమాహ్యనము*

కామారెడ్డి పట్టణంలో కల శ్రీ త్రిశక్తి దేవి ఆలయంలో ప్రధాన పూజారి కోశిక శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో శ్రీ రుద్రసహిత శతచణ్డీ పురశ్చరణ మహా యాగం లోక కళ్యాణ అర్థం కొరకై సమస్త భక్తజన సౌజన్యంతో అమ్మవారి ప్రేరణతో గురువుల ఆశీస్సులచే మంత్ర దీక్షను సార్థకం నామధేయ దిశగా శ్రీ రుద్రసహిత శత చణ్డీ పురశ్చరణ మహా యాగం శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక బహుళ చతుర్దశి నుండి మార్గశిర శుక్ల పాడ్యమి వరకు అనగా 30 నవంబర్ 2024 నుండి 02 డిసెంబర్ 2024 వరకు త్రయాహాన్నీక దీక్షా విధానంతో త్రిశక్తి క్షేత్రం కామారెడ్డి నందు అందరి సహకారం చే జరప నిశ్చయమైందని తెలిపారు. అలాగే 30 నవంబర్ శనివారం ఉదయం 8:15 నిమిషములకు విగ్నేశ్వర పూజ పుణ్యావాచనం యాగశాల ప్రవేశం శ్రీ చక్రార్చన సహస్ర మోదక హోమం మొదలగు పూజలు జరుపుతారు, తర్వాత 1.00 కు హారతి తీర్థ ప్రసాద వితరణ మరల సాయంత్రం 5.30 నిమిషాలకు హారతి తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. మరుసటి రోజు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రాతకాల పూజలు సూర్య నమస్కారములు 9.00 గంటలకు మండపారాధన, 10.30 నిమిషాలకు అమ్మవారికి లక్ష పుష్పార్చన, మధ్యాహ్నం 1.00 హారతి తీర్థ ప్రసాద వితరణ మరలా, సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రదోషకాల పూజ రాత్రి 8.30 నిమిషాలకు హారతి తీర్థ ప్రసాద వితరణ తర్వాత సోమవారం ఉదయం 7.00 గంటలకు రుద్ర పారాయణం 8.00 గంటలకు చండీ హోమం 9.00 గంటలకు మండపారాధన 11:30 నిమిషాలకు పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ, మహాదాశీర్వచనములు ఇవి ఏ కాకుండా ఈ మూడు రోజుల్లో సమయానుకూలంగా ప్రముఖ పండితులచే ఆధ్యాత్మిక ప్రవచనములు నిర్వహింపబడతాయని తెలిపారు. కావున భక్త మహాశయులు దేవి ప్రీతి అర్థం ఆచరించేడి ఈ యాగంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి భగవతి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరారు. ఇట్టి బృహత్ కార్యక్రమంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వస్తువు రూపెన ధన రూపేనా పాల్గొనదలచిన భక్తులు అర్చకులు కోశిక శ్రీధర్ శర్మ సెల్ నెంబర్ 8 9 1 9 5 2 3 735 ను సంపదించగలరని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment