రాష్ట్ర ( ప్రాంత) స్థాయి విజ్ఞానమేల లో సత్తా చాటిన జమ్మికుంట శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థి
*విద్యార్థికి బహుమతి అందించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి*
*జమ్మికుంట సెప్టెంబర్ 14 ప్రశ్న ఆయుధం
ఈనెల 12,13, 14వ తేదీల్లో కామారెడ్డిలో జరిగిన శ్రీ సరస్వతీ విద్యాపీఠ రాష్ట్రస్థాయి విజ్ఞానమేలలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ జమ్మికుంట విద్యార్థిని చిరంజీవి సుకాషి వ్యోమిక 6వ తరగతి బాలవర్గ ( అండర్ 14) బేస్డ్ ఆన్ సోలార్ ఎనర్జీ విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుపొందిందని ఈ విద్యార్థినిని శిక్షకులు (ఆచారి) సౌందర్య మాతాజీని పాఠశాల ప్రబంధకారిణి, సమితి సభ్యులు, పాఠశాల ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్ ఆచార్య బృందం అభినందించారు.