కామారెడ్డిలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి విజయదశమి ఉత్సవం
జిల్లాలోనే మొట్టమొదటి పరంజ్యోతి భగవతి ఆలయం ప్రత్యేక ఆకర్షణ
విజయదశమి సందర్భంగా అమ్మవారికి బంగారం (జంబి) సమర్పణ
శమీ వృక్ష పూజ, అర్చన కుంకుమ, సోమతీర్థం ప్రసాదం
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 వరకు భక్తుల దర్శనానికి అవకాశం
ఆలయ కమిటీ సభ్యులు ఎర్రం విజయ్ కుమార్, వినోద్ కుమార్ తదితరుల పర్యవేక్షణలో ఏర్పాట్లు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 27
కామారెడ్డి జిల్లాలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. జిల్లాలో మొట్టమొదటి పరంజ్యోతి ఆలయంగా గుర్తింపు పొందిన ఈ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ సన్నాహాలు పూర్తి చేసింది.ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి బంగారం (జంబి) సమర్పించి దైవానుగ్రహం పొందే అవకాశం కల్పించారు. శమీ వృక్ష పూజ ప్రధానంగా నిర్వహించబడుతుంది. దర్శనం అనంతరం ప్రతి భక్తుడికి అమ్మవారికి అర్చన చేసిన పవిత్ర కుంకుమ, సోమతీర్థం ప్రసాదం అందజేస్తారు.ఉత్సవం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని ఆలయ సభ్యులు తెలిపారు. ఈ ఏర్పాట్లలో ఎర్రం విజయ్ కుమార్, ఎర్రం వినోద్ కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు.