*ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం*
*ఇల్లందకుంట జనవరి 9 ప్రశ్న ఆయుధం*
ఏకాదశిని పురస్కరించుకొని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉత్తర ద్వారా దర్శనానికి ఆలయ ఈవో కందుల సుధాకర్ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా పందిర్లను ఏర్పాటు చేసి ఆలయాన్ని విద్యుత్ రంగుల బల్బులతో పువ్వులతో అతి సుందరంగా అలంకరించి ఉత్తర ద్వారా దర్శనానికి (ముక్కోటి ఏకాదశి) శుక్రవారం ఉదయం ప్రాతఃకాలం నుండి మొదలవుతుందని తెలిపారు భక్తులు సకాలంలో వచ్చి క్యూలైన్లో దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు తన వెంట అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు
Post Views: 10