అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి వేడుకలు

ప్రశ్న ఆయుధం మే07: కూకట్‌పల్లి ప్రతినిధి

శేరిలింగంపల్లి: చందానగర్, హుడా కాలనీ లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వ్యవస్థాపకులు, చైర్మన్ పోల వాణీ కోటేశ్వర రావు ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి వేడుకలను ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలలో సుమారు రెండు వందల మంది కుంకుమార్చన, వాసవి మాత పారాయణం చేశారు. మూడు వందల మంది శ్రీ వాసవి మాత దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగ దేవాలయ చైర్మన్ పోల వాణీ కోటేశ్వర రావు మాత సన్నిధిలో భక్త జనులకు అల్పాహారం, అన్న ప్రసాదాలను ఏర్పాటుచేశారు. వాసవి మాత అనుగ్రహముతో అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. ఈ వేడుకల కార్యక్రమంలో ఆలయ కమిటీ మారం వెంకట్ బాదం సాయిబాబు, ఉష రాణి సత్యనారాయణ, మెంబెర్స్ బాలయ్య , పృథ్వి , హిరహ్మయి, రాణి సుధాకర్ రచూరి రాము, సుదర్శన్ రావు,రాములు, జితమన్యు , ఎమ్ వి. సుబ్బారావు,ఆర్య వైశ్య సంఘం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాత కృపకు పాత్రులైనారు.

Join WhatsApp

Join Now