శిల్ప నగర్‌లో వైభవంగా శ్రీ వెంకట మరకత చంద్రమౌళీశ్వర హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం

*శిల్ప నగర్‌లో వైభవంగా శ్రీ వెంకట మరకత చంద్రమౌళీశ్వర హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 15

మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శిల్ప నగర్‌లో శ్రీ వెంకట మరకత చంద్రమౌళీశ్వర హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.

మల్లారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొని, స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతిని, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

దేవాలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు మల్లారెడ్డిని ఘనంగా సత్కరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో, వైభవంగా జరిగాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment