పాత పాల్వంచలో వైభవంగా శ్రీ విజయశాంభవిఅమ్మవారి దివ్యప్రతిష్ఠా మహోత్సవం

IMG 20240828 WA2959

పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల దంపతులు

పాత పాల్వంచలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయశాంభవి అమ్మవారి దేవాలయంలో శ్రీ అమ్మవారి దివ్యప్రతిష్ఠా మహోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు మంగళవారం మంగళవాద్యములు, హోమములు, విగ్రహాలకు జలాధివాసము, క్షీరాదివాసము, నీళ్లు, పాలతో అభిషేకాలు నిర్వహించారు. బుధవారం చివరి రోజున శ్రీ విజయశాంభవి అమ్మవారు, గణపతి, జంట నాగులు, పోతురాజు స్వామి, యంత్ర విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి, బలిహరణ, దర్పణం దర్శనము, అమ్మవారి దివ్యదర్శనం వంటి పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవాలను వేదపండితులు కొడమంచిలి ఫణికుమార్ శర్మ బృందం నిర్వహించారు.

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కొత్వాల దంపతులు

ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో డీసీఎంస్చై ర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని, పూజలు చేసారు.

2 వేల మంది భక్తులకు అన్నప్రసాదం

విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి వచ్చిన సుమారు 2 వేల మంది భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెద్దలు కొత్వాల సత్యనారాయణ, పుప్పాల వెంకటేశ్వర్లు (బాబు), ఉత్సవాల నిర్వాహకులు నిమ్మల భద్రయ్య, నిమ్మల మల్లిఖార్జునరావు, అమరాబాదుల సీతారాం, నిమ్మల వెంకట్రావు, బసవరాజుల వెంకన్న, నిమ్మల వీరభద్రం, కొమరరాజుల బ్రహ్మం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, కందుకూరి రాము, పులి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now